Sunday, April 17, 2011

కథ పై తెలుగు హీరోలు దృష్టి పెట్టట్లేదా ?

ఈ మధ్య కాలంలో విడుదలైన అగ్ర హీరోల చిత్రాలు ఖలేజా, పులి, శక్తి చిత్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ చిత్రాలన్నీ భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలే. ఇప్పుడు విడుదలైన పవణ్ కళ్యాణ్ తీన్‌మార్ కూడా రెండు రకాల టాక్ లని వినిపిస్తోంది. ఈ వరుస పరాజయాలన్నింటికీ కారణం కథ సరిగ్గా లేకపోవడమే అంటున్నారు సినీ విశ్లేషకులు. మన తెలుగు అగ్ర తారలు సినిమా కథపై కాకుండా బడ్జెట్ పైనే దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే చిన్న చిత్రాలుగా విడుదలైన అలా మొదలైంది, ప్రేమ కావాలి లాంటి చిత్రాలు మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. మరి మన తెలుగు అగ్ర హీరోలు కూడా కథ పై దృష్టి పెడితే మంచి విజయాలు సాధించవచ్చని విశ్లేషకులు , అభిమానుల ఆలోచన.

No comments:

Post a Comment