Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Wednesday, June 1, 2011

16 భాషల పాట తో వస్తున్న శంకర్

శంకర్
తన ప్రతీ సినిమా లోనూ ఏదో ఒక కొత్తదనం ఉండాలనుకునే దర్శకుడు శంకర్. ఈ సారి తన దృష్టి పాట పై పెట్టాడు. 3 ఈడియట్స్ తమిళ రీమేక్ చిత్రం "నన్‌బన్" లో ఈ ప్రయోగం చేయనున్నాడు. 16 భాషల సాహిత్యం తో ఈ పాటని రికార్డ్ చేశారు. ఈ పాటకి మదన్ కార్కీ సాహిత్యం అందించగా విజయ్ ప్రకాష్ దీనిని పాడడం జరిగింది. పాటలో కనిపించే లొకేషన్స్ కూడా ఇదివరకు ఎప్పుడు చూడని ప్రదేశాలని తెలుస్తోంది.

రాంచరణ్ తో నటించట్లేదు

మీన
వి వి వినాయక్ దర్శకత్వం లో రాంచరణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం లో మీన నటిస్తోందనే వార్తలు వచ్చాయి. రాంచరణ్ తేజ్ కి అత్తగా మీన నటిస్తోందని సినీ వర్గాల్లో వార్తలు వచ్చాయి. అయితే ఈవిషయం పై మీన స్పష్టత తెచ్చింది. తను ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లోనూ నటించట్లేదని తనకి తన అయిదేళ్ళ పాప నైనికా ని చూసుకోవడం తోనే సరిపోతుందని తెలిపింది. ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లోనూ భవిష్యత్తు లో నటిస్తానేమో ఇప్పుడే చెప్పలేనని చెప్పింది.

Tuesday, May 31, 2011

చిరంజీవి అల్లుడికి సుప్రీం కోర్టు లో చుక్కెదురు

చిరంజీవి రెండవ కూతురు శ్రీజ ను పెళ్ళి చేసుకున్న శిరీష్ వరకట్న వేధింపుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబాల మధ్య సామరస్య పూర్వకంగా చర్చలు నడుస్తున్నాయని త్వరలోనే సమస్య తొలగొపోతుందని తనకు ముందస్తు బెయిలు మంజూరు చెయ్యాలని శిరీష్ కోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్ కోర్టు లో బెయిల్ రానందున సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు శిరీష్. సుప్రీం కోర్టు కూడా బెయిల్ కి నిరాకరించింది.

Saturday, May 28, 2011

కమల్‌హాసన్ తో శ్రీయ

కమల్ హాసన్ - శ్రీయ
కమల్‌హాసన్ స్వంతం గా దర్శకత్వం వహిస్తూ హీరోగా చేస్తున్న తాజా చిత్రం "విశ్వరూబయ్". ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు కమల్‌హాసన్. అయితే ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. మొదటి హీరోయిన్ గా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్ హ నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం లో రెండవ హీరోయిన్ గా శ్రీయ ఎంపికయ్యిందట. అప్పట్లో శ్రీయ కమల్‌హాసన్ సరసన మర్మయోగి చిత్రం లో నటించాల్సి ఉంది. కానీ ఆ చిత్రం ఆగిపోవడం వలన కమల్‌హాసన్ సరసన నటించే అవకాశం కోల్పోయింది శ్రీయ. ఇప్పుడు ఈ విశ్వరూబయ్ చిత్రం ద్వారా మళ్ళీ ఆ అవకాశం దక్కించుకుంది శ్రీయ.

నా మాటలను వక్రీకరించారు - ఇలియానా

ఇలియానా
గోవా సుందరి ఇలియానా ఈ మధ్య చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. శక్తి సినిమా విడుదల తర్వాత ఓ ఆంగ్ల పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి లోనయ్యింది. శక్తి సినిమా ఫ్లాప్ అవుతుందని తనకి ముందే తెలుసని, ఫ్లాప్ అయిన సినిమా కి పబ్లిసిటీ చేసి లాభం లేదని ఇలా చాలా మాటలు చెప్పింది ఇలియానా అప్పట్లో . అయితే తాజాగా మాట్లాడుతూ మీడియా తన మాటలను వక్రీకరించిందని శక్తి సినిమా ఫ్లాప్ గురించి తను ఎప్పుడూ మాట్లాడలేదని, అలా అనే దాన్ని అయితే శక్తి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం లో డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్  ఎందుకిస్తానని అది తన సినీ జీవితం లో మొదటి స్టేజ్ షో అని చెప్పింది. ఈ మాటల తోనైనా జూనియర్ ఎన్ టి ఆర్ తో పాటు నందమూరి అభిమానుల కు మళ్ళీ దగ్గర అవ్వాలని అనుకుంటుందేమో మన ఇలియానా.


Friday, May 27, 2011

వరుస చిత్రాలతో పండగ చేయనున్న రాంచరణ్ తేజ్

రాంచరణ్ తేజ్
ప్రస్తుతం రాంచరణ్ తేజ్ వరుసగా మూడు సినిమాలకు అంగీకరించాడు. ముగ్గురు అగ్ర హీరోయిన్ లతో రూపొందుతున్న ఈ చిత్రాలతో అభిమానులకు పండగ చేయనున్నాడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్. సంపత్ నంది దర్శకత్వం లో వస్తున్న "రచ్చ" సినిమా లో రాంచరణ్ తేజ్ సరసన తమన్నా జత కడుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వం లో వస్తున్న చిత్రానికి సమంత హీరోయిన్ గా ఎంపికయ్యింది. తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రాంచరణ్ తేజ్ ఖరారు చేసుకున్న చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుందని ప్రాధమిక సమాచారం. తెలుగు సినిమా చరిత్రని తిరగ రాసిన మగధీర తర్వాత మరోసారి రాంచరణ్ తేజ్ సరసన నటించనుంది కాజల్ అగర్వాల్. మొత్తానికి రానున్న రోజుల్లో మెగా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.


విడుదలకు సిద్దమవుతున్న బద్రీనాథ్

బద్రీనాథ్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమన్నా జంటగా రూపొందిన తాజా చిత్రం "బద్రీనాథ్". వి.వి.వినాయక్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం జూన్ 10 వ తేదీన విడుదలకు సిద్దమవుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ బద్రీనాథ్ చిత్రం పై సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. జూన్ 3 వ తేదీన ఈ చిత్రం సెన్సార్ కి వెలుతుంది. సెన్సార్ పూర్తవడంతో సినిమా విడుదలకు పూర్తి సనద్దం అయినట్టే. ఇటీవలే పాటల షూటింగ్ ఇటలీ లో పూర్తి చేశారు. బద్రీనాథ్ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లో నే ఒక అద్భుత చిత్రం గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.



Thursday, May 26, 2011

3 భాషల్లో భారీ ఎత్తున విడుదల అవుతున్న "బద్రీనాథ్"

బద్రీనాథ్
అల్లు అర్జున్, తమన్నా జంటగా రూపొందిన తాజా చిత్రం "బద్రీనాథ్". వచ్చే నెల 10 వ తేదీన ఘనంగా విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని 3 రాష్ట్రాల్లో, 3 భాషల్లో ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, మళయాలం 3 భాషాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ 3 రాష్ట్రాల్లోను ఈ సినిమా విడుదల కాబోతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. అల్లు అర్జున్ కెరియర్ లోనే ఇది ఒక సూపర్ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

Saturday, May 21, 2011

అభిమానుల కోసం రజనీకాంత్ లేటెస్ట్ & రీసెంట్ ఫోటో

రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్ లో చేరిన నుంచి అభిమానులు, ప్రజలు ఎంతో ఆందోళన కి లోనవుతున్నారు. రజనీకాంత్ కుటుంబ సభ్యులు ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందవద్దని చెబుతున్నా అభిమానుల్లో మాత్రం ఇంకా ఏదో చెప్పలేని అసంతృప్తి. ఎందుకంటే స్వయంగా రజనీకాంత్ ఫోటో గానీ వీడియో గానీ హాస్పిటల్ లో చేరిన తరువాత లభించకపోవడం. అయితే రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ ఉత్కంఠ కి తెర దించుతూ తన ట్విట్టర్ లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. రజనీకాంత్ తన కూతురితో ఎంతో ఉల్లాసంగా దిగిన తాజా ఫోటో అది. దీన్ని బట్టి రజనీకాంత్ ఆరోగ్యం కుదుటపడిందని చెప్పవచ్చు.


రచయిత గా వస్తున్న మంచు మనోజ్


మంచు మనోజ్
మంచు మనోజ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం "మిస్టర్ నోకియా". అనిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమా లో ఒక పాటని మంచు మనోజ్ రాశాడు. ఇదివరకే తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మనోజ్ రచయితగా ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి.

వీర మొదటి రోజు కలెక్షన్లు అదుర్స్


Veera Telugu Movie
రవితేజ, కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం "వీర" నిన్న (20-05-2011) ఘనంగా విడుదలయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విడుదల సాధించక పోయినప్పటికీ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. రవితేజ సినిమాలన్నింటిలోను "వీర" సినిమా మొదటి రోజు కలెక్షన్లు అదుర్స్ అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఆ కలెక్షన్లు ఇలా ఉన్నాయి...........

నైజాం - 90 లక్షలు
తూర్పు గోదావరి - 13 లక్షలు
నెల్లూరు - 10 లక్షలు
గుంటూరు - 20 లక్షలు
కృష్ణ - 19 లక్షలు
చిత్తూరు - 13 లక్షలు
కడప - 13 లక్షలు 


Friday, May 20, 2011

బావ ని నిర్మాతని చేస్తున్న రాంచరణ్


రాంచరణ్ తేజ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని పి ఆర్ పి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, దిల్ రాజులు నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ లో దిల్ రాజు లేడని తేలిపోయింది. గంటా శ్రీనివాసరావు తో పాటు రాంచరణ్ సోదరి, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితవదన భర్త విష్ణు ప్రసాద్ నిర్మిచనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాంచరణ్ తేజ్ ప్రకటించాడు.

Thursday, May 19, 2011

బాలయ్య బర్త్‌డే కి మెగా ఫ్యామిలీ అభిమానుల సంబరాలు

బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10. ఈ రోజు నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజున సంబరాలలో మునిగి తేలుతారు. అయితే ఈ పుట్టినరోజు కి మాత్రం ఒక స్పెషల్ ఉంది. ఈ సంవత్సరం బాలయ్య పుట్టిన రోజున మెగా ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకోనున్నారు. అవునండీ.. ఇది నిజమే. అల్లు అర్జున్ తాజా చిత్రం "బద్రీనాథ్" ని జూన్ 10 వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట అల్లు అరవింద్. భారీ స్థాయిలో, అధిక అంచనాలతో వస్తున్న ఈ బద్రీనాథ్ సినిమా పై మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు ప్రజలు, సినీ విశ్లేషకులు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు. ఒక వేళ జూన్ 10 వ తేదీన విడుదల ఖరారు అయితే మెగా ఫ్యామిలీ అభిమానులకు పండగే .. కావున బాలయ్య పుట్టినరోజున మెగా ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకోవడం లాంటి అరుదైన సంఘటనని మనం చూడబోతున్నాం.  


Sunday, May 8, 2011

తాప్సీ "మొగుడు" ఖరారు

తాప్సీ
కృష్ణవంశీ దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా "మొగుడు" అనే సినిమా కి ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో గోపీచంద్ సరసన తాప్సీ కథానాయిక గా నటిస్తోంది. రెండవ హీరోయిన్ గా కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన సాక్షి గులాటి నటిస్తోంది. ఈ మొగుడు చిత్రం షూటింగ్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నల్లమలపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాత. 

Saturday, May 7, 2011

మహేష్ బాబు పై నందమూరి అభిమానుల నిఘా

జూనియర్ ఎన్ టి ఆర్ - మహేష్ బాబు
ఇటీవల జూనియర్ ఎన్ టి ఆర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాహానికి మహేష్ బాబు హాజరయ్యాడు. పెళ్ళికి వచ్చిన అందరి హీరోలలోను స్పెషల్ మహేష్ బాబే. మహేష్ స్టేజ్ పైకి రాగానే భారీ సంఖ్యలో వచ్చిన నందమూరి అభిమానులు మహేష్ ని ఫోటో లు తీయడానికి తమ కెమెరాలు, సెల్‌ఫోన్ లతో పోటీ పడ్డారు. దీన్ని బట్టి నందమూరి అభిమానుల్లో చాలా మంది మహేష్ బాబు పై తమ అభిప్రాయాన్ని చాటారు. ఈ విధంగా నందమూరి అభిమానులు మహేష్ బాబు పై తమ కెమెరా లతో నిఘా పెట్టారు.   

Friday, May 6, 2011

తప్పుడు వార్తలు వద్దు - యస్ యస్ రాజమౌళి

యస్ యస్ రాజమౌళి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లో ప్రభాస్ తో పాటు నితిన్ కూడా ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడని ఓ చానెల్ లో వార్తలు వచ్చాయి. అయితే దీనికి జవాబుగా రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ లో రిప్లై ఇచ్చాడు. ఈ వార్తల్లో అస్సలు నిజం లేదని ఎటువంటి నిరాదారమైన వార్తలు ప్రముఖ చానెల్ లో రావడం బాధాకరమని చెప్పాడు. దీన్ని బట్టి ప్రభాస్ - నితిన్ కాంబినేషన్ లేనట్టే.

Thursday, May 5, 2011

అభిమానులు ఎన్ టి ఆర్ ని చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

జూనియర్ ఎన్ టి ఆర్
ఈ రోజు రాత్రికి జరగబోతున్న జూనియర్ ఎన్ టి ఆర్ - లక్ష్మీ ప్రణతి ల వివాహానికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు. ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానుండడంతో ఎన్ టి ఆర్ సామాన్య అభిమానులకు కనిపించేదుకు ప్రత్యే ఏర్పాట్లు చేశారు. ఒక పెద్ద క్రేన్ ని తెప్పించారు. దీని పై నుండి జూనియర్ ఎన్ టి ఆర్ అభిమానులకు అభివాదం చేస్తారు. ఫ్యాన్స్ నూతన జంటకు 4 లక్షల విలువైన వెంకటేశ్వర స్వామి ప్రతిమ గల బంగారు జ్ఞాపిక ని బహుమతి గా ఇవ్వనున్నారు. 

Wednesday, May 4, 2011

మరో వెరైటీ టైటిల్ తో రవితేజ

రవితేజ
వైరైటీ టైటిల్స్ తో వచ్చే హీరోల్లో రవితేజ ముందుటాడు. మొదటి నుంచి రవితేజ సినిమా ల టైటిల్స్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. రవితేజ కొత్త సినిమా టైటిల్ "సుబ్రమణ్యం ఫర్ సేల్". ఈ టైటిల్ కూడా రవితేజ కి ఎంతో సూటేబుల్ గా ఉంటుందని సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సంవత్సరానికి 3 సినిమాలు చేస్తూ రవితేజ ఎప్పుడూ బిజీగా ఉంటున్నాడు. తనతో సినిమా తీసే నిర్మాత తనకి రెమ్యునరేషన్ ఇచ్చే స్థాయిలో ఉంటే సరిపోతుంది అంటాడట రవితేజ. ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం వలన తనతో పాటు ఎంతో మందికి రెగ్యులర్ ఉపాధి కల్పిస్తున్నాడు రవితేజ.

Tuesday, May 3, 2011

ఫుల్ టైం కామెడీ చిత్రం లో భార్యాభర్తలు

ఐశ్వర్య అభిషెక్
బాలీవుడ్ క్రేజీ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంటగా ఒక కొత్త చిత్రం రూపొందనుంది. రాజకుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పేరు "లేడీస్ అండ్ జెంటిల్‌మెన్". అయితే ఇది ఫుల్ లెంత్ కామెడీ చిత్రమట. చాలా రోజులుగా సీరియస్ చిత్రాల్లో నటిస్తున్న ఈ జంట ఈ సారి సీరియస్ కామెడీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.  

భర్త కోరిక మేరకు మళ్ళీ కెమెరా ముందుకు జ్యోతిక

జ్యోతిక సూర్య
జ్యోతిక సూర్య ల వివాహం తర్వాత జ్యోతిక సినిమా లకు దూరమైంది. ఇటీవల సూర్య కోసం ఓ యాడ్ లో నటించింది. అయితే సూర్య హీరోగా వస్తున్న కొత్త చిత్రం "మాట్రన్" లో జ్యోతిక కి ఓ ప్రముఖ పాత్ర కేటాయించాలని కోరాడట. డైరెక్టర్ వెంటనే ఒక పాత్రని కేటాయించాడట. ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.