Saturday, April 30, 2011

ముమైత్ ఖాన్ కోరిక తీర్చని పూరీ జగన్నాథ్

ముమైత్ ఖాన్
రాణా, ఇలియానా జంటగా రూపొందిన చిత్రం నేను నా రాక్షసి. ఇటీవలే విడుదలై ఘనంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ చిత్రం లో ముమైత్ ఖాన్ ఒక పాత్ర ని పోషించింది. చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. అయితే కొద్ది రోజులుగా సరియైన గుర్తింపు లేని ముమైత్ ఖాన్ ఈ సినిమా లోని పాత్ర ద్వారా మంచి పేరు వస్తుందని ఆశించింది. పోకిరి లో " ఇప్పటికింకా నా వయసు..... " పాట తో ముమైత్ ఖాన్ కి ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలుసు. కానీ నేను నా రాక్షసి చిత్రం లోని పాత్రకి మాత్రం అంతగా గుర్తింపు రావట్లేదు. దీంతో రెండవ బ్రేక్ ఇస్తాడనుకున్న పూరీ జగన్నాథ్ ముమైత్ ఖాన్ కోరిక తీర్చలేక పోయాడు.

No comments:

Post a Comment